: భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు: గాయకుడు అద్నాన్ సమీ


భారత ప్రభుత్వం తనకు దేశ పౌరసత్వం ప్రకటించడం పట్ల ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఇక్కడి ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపుతున్నారన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ప్రభుత్వం తనకు విలువైన, అందమైన కానుక ఇచ్చిందని చెప్పారు. తన భార్యతో కలసి ఢిల్లీలో ఇవాళ హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును అద్నాన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత పౌరసత్వం పత్రాలను సమీకి మంత్రి అందజేశారు. జనవరి 1న భారత పౌరసత్వ పత్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన మీడియాకు తెలిపారు. వాటిని స్వీకరించడానికి ఇంతకన్నా మంచిరోజు ఉండదని పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించిన అద్నాన్... 2001, మార్చిలో మొదటిసారి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి తాత్కాలిక వీసాపై భారత్ కు వస్తూపోతూ ముంబైలో ఉంటున్నారు. తాజాగా ఆయనకు శాశ్వతంగా పౌరసత్వం లభించింది.

  • Loading...

More Telugu News