: యాదగిరీశుని సన్నిధికి కలసికట్టుగా తెరాస, దేశం, కాంగ్రెస్ నేతలు... దేవుడికి వినతిపత్రం!
నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలతో నిప్పు, ఉప్పులా ఉండే తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు ఓ విషయంలో మాత్రం ఏకతాటిపై కదిలారు. ఈ ఆసక్తికర ఘటన కొత్త సంవత్సరం తొలి రోజున యాదగిరిగుట్టలో జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఈ ఉదయం యాదాద్రికి వచ్చి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుంది. యాదాద్రి పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని, అందుకు నరసింహుడే నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేలా చేయాలని కోరుతూ స్వామి సన్నిధిలో ఓ వినతిపత్రాన్ని ఉంచారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.