: నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి: దావూద్ కారును తగులబెట్టిన చక్రపాణి మహరాజ్


ఇటీవల ముంబైలో జరిగిన వేలంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కారును రూ.32వేలకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తరువాత ఆ కారును ఆయన ఘజియాబాద్ లో బహిరంగంగా తగులబెట్టారు. దాని ఫలితంగా ఇప్పుడాయన బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల నుంచి తనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, రెండు మెసేజ్ లు వచ్చాయని మహరాజ్ తెలిపారు. అంతేగాక 'దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టిన చోటే నిన్ను తగులబెడతాం' అంటూ ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ను కలసినప్పుడు తనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తామని చెప్పారని, కానీ తాను నిరాకరించానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News