: ఢిల్లీలో అమల్లోకి 'సరి-బేసి' విధానం.... ద్విచక్ర వాహనాలపై వెళుతున్న పలువురు మంత్రులు


కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్య విధానం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఈ ఉదయం నుంచి దాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రోడ్లపై కేవలం బేసి సంఖ్య నంబర్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. ఓ వ్యక్తి నిబంధన అతిక్రమిస్తూ సరి సంఖ్య ఉన్న వాహనంతో రోడ్డుపైకి రాడంతో ఆ వాహనాన్ని అడ్డుకున్నట్టు అధికారులు తెలిపారు. అంతేగాక కారు డ్రైవర్ కు జరిమానా కూడా విధించారు. మరోవైపు పలువురు మంత్రులు ఇవాళ ప్రభుత్వ వాహనాలు లేదా సైకిల్ పై వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఇక ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లనున్నట్టు తెలిపారు. మరో మంత్రి ఇమ్రాన్ హుసేన్ ఆటో రిక్షాలో వెళ్లనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News