: కలర్ ఫుల్ మహేశ్ ను చూపిన 'బ్రహ్మోత్సవం' టీజర్!
"వచ్చింది కదా అవకాశం... ఓ మంచి మాటా అనుకుందాం... ఎందుకు ఆలస్యం... అందరినీ రమ్మందాం" అంటూ ఈ ఉదయం విడుదలైన బ్రహ్మోత్సవం టీజర్ లో మహేశ్ బాబు అదిరిపోయే లుక్స్ లో కనిపించాడు. కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టీజరులో పాట చరణాన్ని, వందలాది మందితో కలసి షాయాజీ షిండే, నరేష్, జయసుధ తదితరులు నృత్యం చేస్తున్న దృశ్యాలను చూపారు. చివర్లో చుట్టూ అందమైన అమ్మాయిల నడుమ మహేశ్ బాబు గాల్లోకి ఎగిరే దృశ్యం హైలైట్ గా నిలువగా, టీజర్ కలర్ ఫుల్ మహేశ్ ను మరింత అందంగా చూపింది.