: నూతన సంవత్సర వేడుకలతో హోరెత్తుతున్న హైదరాబాదు, విశాఖ


తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాదులోని స్టార్ హోటళ్లు, పబ్ లు, క్లబ్ లు, రిసార్టులు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థల న్యూఇయర్ వేడుకల నిర్వహణ ప్రాంతాలు యువతతో నిండిపోయాయి. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో యువత కేరింతలు కొడుతోంది. విశాఖపట్టణంలో నోవాటెల్, గేట్ వే, గ్రాండ్ బే, ఫార్చ్యూన్, డాల్ఫిన్ హోటల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్ యువత కేరింతలతో హోరెత్తుతోంది. వివిధ ప్రధాన పట్టణాల్లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News