: షేన్ వార్న్ ఎప్పట్లానే అందాల భామలతో సెలబ్రేట్ చేసుకున్నాడు
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విలాస పురుషుడు అన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక చిలిపి చేష్టలతో వార్తల్లో నిలిచే షేన్ వార్న్ భార్య నుంచి విడివడిన తరువాత లెక్కలేనన్ని ప్రేమాయణాలు నడిపాడు. అంతేకాదు, పలు డేటింగ్ సైట్స్ ద్వారా యువతులకు గాలం వేస్తుంటాడు. మీడియాకు దొరికిపోయినా నిస్సిగ్గుగా ఒప్పేసుకుంటాడు. గతేడాది సూపర్ మేన్ తరహాలో వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న షేన్ వార్న్, అదే తరహాలో 2016కు కూడా ఆహ్వానం పలికాడు. అందాల భామల మధ్య వేడుకలు జరుపుకున్నాడు. అనంతరం తన నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయని ప్రకటించాడు.