: అమెరికా యువకుడికి 3డీ ముక్కును అమర్చిన వైద్యులు!


అమెరికాలోని పధ్నాలుగేళ్ల యువకుడికి తొలిసారిగా 3డీ ప్రింటెడ్ ముక్కును విజయవంతంగా వైద్యులు అమర్చారు. 3డీ ద్వారా ప్రింట్ చేసిన ముక్కును అమర్చడం అమెరికాలో ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. మార్షల్ ద్వీపానికి చెందిన డాలన్ జెన్నెట్ అనే యువకుడికి ఈ అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొంది. జెన్నెట్ కు తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు విద్యుత్ తీగలపై పడడంతో అతని ముఖం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో జెన్నెట్ వాసన పీల్చుకోవడానికి, రుచి తెలుసుకోవడానికి ఇబ్బంది పడడంతో, గతంలో పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఈ 3డీ ముక్కును అతనికి అమర్చారు.

  • Loading...

More Telugu News