: నా వ్యక్తిత్వాన్ని నో బడి కెన్ క్వశ్చన్.. చంద్రబాబు!


పార్టీలు పెట్టి ప్రజాస్వామ్యం ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, సమాజాన్ని అతలాకుతలం చేస్తుండే వారిని చూస్తూ ఊరుకోనని.. వారి నుంచి సమాజాన్ని పరిరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘వారానికొకసారి కోర్టుకు వెళ్లే వాళ్లు నాపై, మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని నో బడీ కెన్ క్వశ్చన్!. ముఫ్పై ఐదు సంవత్సరాలుగా నేను ఒక విధానాన్ని అవలంబించాను. క్యారెక్టర్, కఠోర పరిశ్రమ, వ్యక్తిగత క్రమశిక్షణతో నేను పనిచేశాను. కనుక వారికి నన్ను ప్రశ్నించే అర్హత లేదు. నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News