: మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ తోపులాట
తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మధ్య తోపులాట కలకలం రేపుతోంది. హైదరాబాదులోని శేరిలింగంపల్లి దీప్తిశ్రీనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో అభివృద్ధిపై వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య తలెత్తిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఒకరిపై మరొకరు దూషణల పర్వం కొనసాగించారు. ఇవి ముదరడంతో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీనికి నిరసనగా మహేందర్ రెడ్డి, గాంధీ వర్గీయులు వేర్వేరుగా రహదారిపై బైఠాయించి, నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.