: కాంతులీనుతున్న ట్విట్టర్ ఎమోజీ.. ప్రపంచ భాషల్లో శుభాకాంక్షలు చెబుతూ యానిమేషన్!
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 2016 ఎమోజీని విడుదల చేసింది. తారాజువ్వలతో కాంతులీనుతున్న ఈ ఎమోజీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 35 భాషల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ యానిమేషన్ ను కూడా విడుదల చేసింది. కాగా, నేటి తరం వారు తమ అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగించే చిన్న చిన్న బొమ్మలే ఎమోజీలు. నెటిజన్లు వీటిని ఉపయోగించి తాము చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతుండటం పరిపాటి అయింది. కాగా, ఇంకొన్ని గంటల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో నెటిజన్లు తమ విషెస్ ను ట్విట్టర్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.