: కాల్ మనీ కేసులో నన్ను అకారణంగా ఇరికించారు: డీఈ సత్యానంద్


కాల్ మనీ కేసులో తనను అకారణంగా ఇరికించారని ఏపీఎస్ పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ సత్యానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉద్యోగ సంఘం నేతగానే సీఎం చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావును కలసినట్టు తెలిపారు. కాల్ మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సత్యానంద్ స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట ఈ కేసులో హైకోర్టు నుంచి ఆయనకు ముందస్తు బెయిల్ లభించగా, ఇవాళ విజయవాడలోని ఒకటో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించారు. ఈ సందర్భంగానే పైవిధంగా మాట్లాడారు. కాగా ఈ విషయంపై ఏపీ డీజీపీ రాముడు మాట్లాడుతూ, ఒక్క కేసులో మాత్రమే సత్యానంద్ కు బెయిల్ లభించిందన్నారు. మిగతా వాటిల్లో విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News