: ఆ ‘పాక్’ గాయకుడు రేపటి నుంచి భారతీయుడే!


పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు భారత హోం శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడుతూ, సమీకి రేపటి నుంచి భారతీయపౌరసత్వం అమల్లోకి వస్తుందన్నారు. తనకు భారతీయ పౌరసత్వం కావాలంటూ సమీ రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. కాగా, పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన అద్నాన్ సమీ విజిటర్స్ వీసాపై భారత్ కు మొట్టమొదటిసారిగా 2001, మార్చి 13 న వచ్చారు. ఒక ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. తర్వాత ఆయన వీసా గడువును క్రమబద్ధీకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సమీకి పాకిస్తాన్ పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ 2010, మే 27. ఈ ఏడాది మే 26తో ఆ పాసు పోర్ట్ గడువు ముగిసింది. అయినప్పటికీ సమీ దానిని రెన్యువల్ చేయించలేదు. ఆ తర్వాత భారత ప్రభుత్వ అధికారులను సమీ కలుసుకున్నారు. మానవతా దృక్పథంతో తనకు భారత పౌరసత్వాన్ని లీగలైజ్ చేయాలంటూ విన్నవించుకోవడం జరిగింది. ‘కభీ తో నజర్ మిలావో’, ‘లిఫ్ట్ కరా దే’ అనే రెండు పాటలతో సమీ చాలా పాప్యులర్ అయ్యాడు. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ భజరంగీ భాయి జాన్ చిత్రంలోని ‘భర్ దో జోలి మేరీ’ అనే పాటను సమీ పాడిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు సినిమాలలో కూడా పలు పాటలు పాడాడు.

  • Loading...

More Telugu News