: గ్రేటర్ ప్రజలకు కేసీఆర్ వరం...ఇంటి పన్ను తగ్గింపు!
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కోడ్ అమల్లోకి రాకముందే ప్రజలకు దగ్గరయ్యేందుకు కేసీఆర్ సర్కారు వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు మంచినీరు, కరెంటు బిల్లులను మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇంటి పన్నులను 90 శాతం వరకూ తగ్గించింది. రూ. 1200 వరకూ ఇంటి పన్ను కడుతున్నవారు రూ. 101 చెల్లిస్తే సరిపోతుంది. ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం), బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం) గడువును సైతం మరో నెల రోజులకు పెంచుతున్నట్టు జీవోను జారీ చేసింది. ఇది గ్రేటర్ ప్రజలకు ఓ మంచి ఊరటే. ఈ ఊరట టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏ మేరకు ఓట్లను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.