: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు... మనీలాలో 200 మందికి గాయాలు!


2016 వచ్చేసింది. ఇండియాలో కొత్త సంవత్సరం రావడానికి ఇంకా 8 గంటలకు పైగా సమయం ఉన్నప్పటికీ, జపాన్, న్యూజిలాండ్ తదితర దేశాలు నూతన ఏడాదికి స్వాగతం పలికాయి. పలు తూర్పు దేశాల్లో వేడుకలు మిన్నంటుతున్నాయి. సిడ్నీ హార్బర్ బాణసంచా వెలుగులతో నిండిపోగా, టోక్యో వీధులు ప్రజల ఆనందోత్సాహాలతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ఫిలిప్పీన్స్ లో నూతన సంవత్సర వేడుకల వేళ అపశృతి చోటుచేసుకుంది. మనీలాలో 2016కు స్వాగతం పలుకుతున్న వేళ కొందరు సైనికులు, పోలీసులు, ప్రజలు తుపాకులను గాల్లోకి పేల్చడం, ఆపై పక్కనే ఉంచిన బాణసంచాకు నిప్పంటుకోవడంతో 200 మంది గాయపడగా, ఒకరు మరణించారు. గాయపడ్డవారందరినీ ఆసుపత్రులకు తరలించామని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. తుపాకులు కాల్చిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News