: ఇక కపిల్ 'చీట్' ఫండ్స్ వంతు!


కస్టమర్లను మోసం చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీల జాబితాలో కపిల్ చిట్ ఫండ్స్ కూడా చేరింది. ఈ కంపెనీ ఎన్నో ఏళ్లుగా వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కపిల్ చిట్స్ పై ఫిర్యాదు చేసింది ఎవరో సామాన్య ప్రజలు కారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ భార్య రిజ్వానా కపిల్ చిట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను రూ. 10 లక్షల చిట్ వేశానని, ఆ సంస్థ తనకు డబ్బు చెల్లించడం లేదని పోలీసులకు తెలిపారు. దీంతో కపిల్ చిట్ ఫండ్స్ ఎండీతో పాటు మరో ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 409, 420 రెడ్ విడ్-34ల కింద కేసు పెట్టిన పోలీసులు, దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News