: బీజేపీ ఎమ్మెల్యే ఫోటో పక్కన పాకిస్థాన్ జెండా... వివాదం రేపుతున్న పోస్టర్!


బీజేపీ ఎమ్మెల్యే ఫోటో పక్కన పాకిస్థాన్ జాతీయ పతాకం ముద్రించి ఉన్న పోస్టర్ సంచలనం సృష్టించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్ లో ‘పాక్’ జెండా కూడా ఉంది. మిలాద్ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ పోస్టర్ ను ఒక కరెంట్ స్తంభంపై ఏర్పాటు చేశారు. సరంగ్ ఫొటోతో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఈ పోస్టర్ లో ఉన్నారు. దీంతో రాజకీయపార్టీల నుంచి పలు విమర్శలు ఆయనకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వాస్ సరంగ్ మాట్లాడుతూ, పోస్టర్ పై తన ఫొటో వార్త విని ఆశ్చర్యపోయానని, దీంతో తనకేమి సంబంధం లేదని చెప్పారు. ఈ సంఘటనకు కారణం అసాంఘిక శక్తులేనని అన్నారు. ఈ విషయమై భోపాల్ డీజీపీ ఒక లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరిట తప్పుడు సందేశాలు పంపుతున్నట్లు సరంగ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News