: వర్మ వైరాగ్యం... సంవత్సరం ఒక్కటే కొత్తది, భార్య, స్నేహితురాలు, ఉద్యోగం పాతవేగా!
కొత్త సంవత్సరం రానున్న వేళలో సైతం దర్శకుడు రాంగోపాల్ వర్మ భిన్నమైన శైలిలో స్పందించాడు. వస్తున్న సంవత్సరం ఒక్కటే కొత్తదని, మిగతావన్నీ పాతవేకదా? అంటూ అభిప్రాయపడ్డాడు. కొద్దిసేపటి క్రితం సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ లోని తన ఖాతా ద్వారా స్పందిస్తూ, కొత్త సంవత్సరంలో భార్య, స్నేహితురాలు, చేస్తున్న ఉద్యోగం, ఎదుర్కొనే సమస్యలూ అన్నీ పాతవేనని వైర్యాగ్యాన్ని ప్రదర్శించాడు. "It's only the year which becomes New..but the wife,the girlfriend,the job,the problems will all remain as old as they were" అని పోస్టు పెట్టాడు.