: యాదాద్రితోనే జిల్లాల పునర్విభజన పరిపూర్ణం: మోత్కుపల్లి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి కేంద్రంగా జిల్లా ప్రకటించాలని టీ.టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రికి స్థానం దక్కితేనే జిల్లాల పునర్విభజన పరిపూర్ణమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రేపు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి వినతిపత్రం సమర్పిస్తామని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కాగా యాదాద్రి వరకు మెట్రో రైలును పొడిగిస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఆ పని పూర్తి చేస్తే సీఎంను తాను అభినందిస్తానని మోత్కుపల్లి అన్నారు.