: జనవరిలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే జనవరిలో దావోస్ లో పర్యటించబోతున్నారు. జనవరి 20 నుంచి 23 వరకు ఈ పర్యటన ఉంటుందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగానే చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారని అధికారులు పేర్కన్నారు. సీఎం వెంట కొందరు మంత్రులు, ఎంపీలు, అధికారులు వెళ్లే అవకాశం ఉంది.