: ఔట్ లుక్ పత్రికపై కేసు కొట్టివేత


ప్రముఖ పత్రిక ఔట్ లుక్ పై కేసును హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ సీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పై కొన్ని నెలల కిందట ఔట్ లుక్ ఓ వ్యంగ్య కార్టూన్ వేసింది. ఈ వ్యవహారంలో స్మితాను కించపరిచేలా కార్టూన్ వేశారని, ఆమె పరువు నష్టం కలిగించారంటూ ఆమె భర్త అకున్ సబర్వాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు ఔట్ లుక్ పై కేసు నమోదు చేశారు. తాజాగా తమపై కేసును కొట్టివేయాలని పత్రిక ప్రతినిధులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేయగా... పరిశీలించిన కోర్టు కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News