: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు అన్నీ ఇన్నీ కాదు!


విశాఖపట్నం పరిధిలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న ఏసీబీ అధికారులు నోరెళ్ల బెడుతున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆనంద్ కుమార్ బంధువుల ఇళ్లు, ఆయన ఇళ్లలో సోదాలు జరుపుతున్న అధికారులు కోట్లాది రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లాసన్ బే కాలనీలోని అత్యంత విలాసవంతమైన ఆయన ఇంట్లో ఈ ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాల్లో భాగంగా 9 ఎంఎం పిస్టల్, 40 రౌండ్ల బులెట్లతో పాటు ఓ గొడ్డలి కూడా బయట పడ్డట్టు అధికారులు తెలిపారు. ఆయన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. పలు బ్యాంకుల్లో ఆయన నిర్వహిస్తున్న లాకర్లను పరిశీలించాల్సి వుందని తెలిపారు. సోదాల్లో భాగంగా ల్యాండ్ మాఫియాతో ఆనంద్ కుమార్ కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు, ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News