: కేసీఆర్ మనవడి భుజంపై చెయ్యేసి నడిచిన గవర్నర్ నరసింహన్
ఇటీవలి కాలంలో కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు అధికారిక కార్యక్రమాల్లో తాత వెంట ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్ కు ఎంతో ప్రియమైన హిమాన్షును భావి వారసుడిగా ఇప్పటి నుంచే తెరాస వర్గాలు భావిస్తున్నాయి. ఇక, ఈ ఉదయం రాష్ట్రపతి తన శీతాకాల విడిదిని ముగించుకుని తిరిగి ఢిల్లీకి పయనమైన వేళ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమానికి తాత వెంట హిమాన్షు కూడా వచ్చాడు. ప్రణబ్ విమానం ఎక్కిన తరువాత వెనక్కు బయలుదేరిన గవర్నర్ నరసింహన్ పక్కనే వస్తున్న హిమాన్షు భుజంపై చెయ్యేసి కాసేపు ముచ్చటిస్తూ సాగారు. ఆయన ఏమడిగారో తెలియదుగానీ, దానికి హిమాన్షు చెప్పిన సమాధానాన్ని ఆసక్తిగా వినడం కనిపించింది. కేసీఆర్ సైతం చిరునవ్వుతో వారిని తిలకిస్తూ సాగారు.