: ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది... ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ప్రణబ్
హైదరాబాదులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది ముగిసింది. 14 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయిభీమవరంలోని టీడీడీ వేద పాఠశాలను ప్రారంభించారు. పలువురు నేతలు రాష్ట్రపతిని కలిశారు. అనంతరం ఇవాళ హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి వాయుసేన విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపి వీడ్కోలు పలికారు. పర్యటన ముగిసిన నేపథ్యంలో నిన్న(బుధవారం) రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.