: ఇరుముడుల డబ్బు విషయంలో... ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురుభవానీల మధ్య ఘర్షణ


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురుభవానీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇక్కడ మల్లికార్జున మండపంలో భవానీల దీక్షల విరమణ కార్యక్రమం జరిగింది. అగ్నిప్రతిష్ఠాపనలతో దీక్షల విరమణకు అంకురార్పణ జరిగింది. ఈసారి ఆలయ అధికారులు భవానీల ఇరుముడులను గురు భవానీలకు అప్పగించారు. అయితే ఇరుముడులు ఇచ్చేందుకు వచ్చిన అర్చకులను గురుభవానీలు అడ్డుకున్నారు. ఇరుముడి ముడుపుల డబ్బును హుండీలో వేయకుండా అర్చకులు తీసుకుంటున్నారని గురుభవానీలు ఆరోపించారు. ఈ క్రమంలో అర్చకులు, గురుభవానీల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. దాంతో బాహాబాహీకి దిగిన వారి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. కానీ వివాదాన్ని మాత్రం ఉన్నతాధికారులు పట్టనట్టే ఉండటం గమనార్హం. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తులు దీక్షలు విరమించనున్నారు.

  • Loading...

More Telugu News