: న్యూ ఇయర్ నాడు ‘ఉగ్ర’దాడులపై ఐబీ హెచ్చరికలు... శంషాబాదులో హై అలర్ట్
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భీకర దాడులతో విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టమైంది. తాజాగా నేటి ఉదయం ఐబీ ముందస్తు హెచ్చరికలతో హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన చాలా మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉన్నపళంగా పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగిన నేపథ్యంలో అక్కడ కాస్తంత హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.