: చత్తీస్ గఢ్ ఆడియో టేపులపై విచారణకు ఈసీ ఆదేశం


చత్తీస్ గఢ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 2014లో ఆ రాష్ట్రంలోని అంతాగఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థి సునాయసంగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంతూరామ్ పవార్ చివరి క్షణంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్న కారణంగానే బీజేపీకి సులువైన విజయం సిద్ధించిందని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ అల్లుడు పునీత్ గుప్తా... కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి, నాటి అంతాగఢ్ అభ్యర్థి మంతూరామ్ లతో చర్చలు జరిపారని, ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుందని కూడా నిన్న ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనాన్ని రాసింది. ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయిన కారణంగానే ఈ ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని కూడా ఆ కథనం పేర్కొంది. ఈ కథనాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం ఆడియో టేపులపై సమగ్ర విచారణ జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News