: జీవితంలో ఎంతో నష్టపోయాను: శృంగారతార షకీలా
వ్యక్తిగతంగా తన జీవితంలో ఎంతో నష్టపోయానని, తన మేనేజర్ సహా సొంతవారు కూడా తన డబ్బుతీసుకుని మోసం చేశారని శృంగారతార షకీలా పేర్కొంది. 1990లలో దక్షిణాది ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన షకీలా చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై నోరు విప్పింది. స్టార్ హీరోల సినిమాలు కూడా వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సమయంలో కూడా షకీలా తన సినిమాలతో మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆమె సినిమాల హవా తగ్గడానికి గల కారణాలపై షకీలా మాట్లాడుతూ, పెద్ద హీరోల సినిమాల్లో కూడా అశ్లీలత ఉన్నప్పటికీ, తాను నటించిన సినిమాలనే భూతద్దంలో చూపించారని పేర్కొంది. కేరళ ఇండస్ట్రీలో మగాళ్ల డామినేషన్ ఎక్కువని, స్త్రీలకు సరైన గౌరవం ఇవ్వకపోవడం వంటి కారణాలతో తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని చెప్పింది. ఇప్పటి తరం నటీనటులు చాలా తెలివైన వారని, సినిమాల్లో నటించినంత కాలం జాగ్రత్తగా ఉంటున్నారని, కొద్దోగొప్పో వెనుకేసుకుని హ్యాపీ గా సెటిల్ అయిపోతున్నారని షకీలా చెప్పింది.