: ‘యే హై మొహబ్బతే’ సీరియల్ బృందానికి అస్వస్థత!
స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే పాప్యులర్ సీరియల్ ‘యే హై మొహబ్బతే’ బృందం అస్వస్థతకు గురైంది. ఈ సీరియల్ షూటింగ్ సన్నివేశాలను నీటిలోపల (అండర్ వాటర్) చిత్రీకరించారు. దీంతో ఆర్టిస్టులు, సీరియల్ చిత్రీకరణ బృందం సుమారు పది గంటలపాటు నీటిలోనే గడపాల్సి వచ్చింది. షూటింగ్ చేసినంత సేపు బాగానే ఉంది కానీ, ఆ మర్నాడు దీని ప్రభావం వారిపై పడింది. ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు చర్మంపై దద్దుర్లు వచ్చినట్లు సీరియల్ సిబ్బంది తెలిపారు. కాగా, కరణ్ పటేల్, దివ్యాంక త్రిపాఠి, రుహానికా ధావన్ తదితరులు ఈ సీరియల్ లో నటిస్తున్నారు.