: తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల


తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈరోజు విడుదల చేసింది. సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, ఎక్సైజ్ ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 439 పోస్టులను భర్తీ చేసేందుకుగాను ఏప్రిల్ 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు గ్రూప్-2 దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. కాగా, టీఎస్పీఎస్సీ ద్వారా మరో 350 పోస్టులకు ప్రకటన విడుదల చేశారు. మెట్రో వాటర్ వర్క్స్ లో డిప్యూటీ మేనేజర్, టెక్నికల్ గ్రేడ్-2, వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేస్తారు.

  • Loading...

More Telugu News