: తెలంగాణ నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుక
తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. టీపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి గ్రూప్ 2 దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. గ్రూప్ 2 విభాగంలో 434 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపింది. సబ్ రిజస్ట్రార్, ఏసీటీవో, మున్సిపల్ కమిషనర్లు, సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.