: కేటీఆర్ కు ‘హార్వర్డ్’ ఆహ్వానం!


తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు అమెరికాకు చెందిన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందింది. వచ్చే ఫిబ్రవరి 6,7 తేదీలలో నిర్వహించనున్న ‘మార్పు దిశగా భారత్- అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. హార్వర్డ్ కెన్నడీ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్యానల్ సంయుక్తంగా కేటీఆర్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయనకు ఒక ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా భారతీయ సంస్థల సీనియర్ కార్యనిర్వాహకులను కేటీఆర్ కలవనున్నారు. వ్యాపారవేత్తలను, దాతలను, ప్రభుత్వ పెద్దలను ఒకే చోటుకు తీసుకువచ్చేందుకుగాను ఈ సమావేశం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News