: విజయకాంత్ దిష్టబొమ్మను కాలుస్తుంటే అన్నా డీఎంకే కార్యకర్తలకు అంటుకున్న నిప్పు!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపైన, జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనటుడు విజయకాంత్ తీరును నిరసిస్తూ, అన్నాడీఎంకే కార్యకర్తలు చేపట్టిన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం జరిగింది. దిష్టిబొమ్మకు నిప్పంటిస్తున్న వేళ, మంటలు ఎగసిపడి ఇద్దరు ఆందోళనకారుల పంచెలకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఓ అన్నాడీఎంకే కార్యకర్తకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం నాడు విల్లుపురంలో జరిగింది. పంచెకు నిప్పంటుకోవడంతో, వెంటనే ఆ కార్యకర్త దాన్ని వదిలి పరుగు లంఘించుకున్నాడు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విజయకాంత్ ను అరెస్ట్ చేసేందుకు జయలలిత సర్కారు ప్రయత్నిస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News