: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగం స్థానాలు కాంగ్రెస్ కైవసం
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అక్కడి అధికార పార్టీ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల నుంచి ఆ రాష్ట్ర శాసనమండలిలోని 25 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సగం స్థానాలు దక్కించుకుంది. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 13 స్థానాలు 'హస్త'గతం కాగా, బీజేపీ 6 స్థానాలు గెలుచుకుంది. జేడీఎస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాలు గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతృప్తి వ్యక్తం చేశారు.