: 'నాన్నకు ప్రేమతో' సినిమా తొలి సీడీని ప్రేమతో నాన్నకు ఇచ్చాను: దేవీశ్రీ ప్రసాద్


జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న'నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో కేసెట్ ను ఆ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ 'ప్రేమతో తన తండ్రి'కి ఇచ్చారు. ఈ మధ్యే కాలం చేసిన ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి దేవిశ్రీ ప్రసాద్ తండ్రి. సంగీతంలో రాణించేందుకు ఎంతో ప్రోత్సహించిన తండ్రి అంటే దేవీకి అంతులేని ప్రేమ. తాను అంగీకరించిన ప్రతి సినిమా తొలి ఆడియో సీడీని తల్లికి, తండ్రికి అందజేయడం దేవీకి అలవాటు. ఈ సారి తన తండ్రి లేకపోవడంతో ఆయన ఫోటో వద్ద 'నాన్నకు ప్రేమతో' సీడీని ఉంచి, ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి, 'ఎప్పట్లానే తొలి సీడీని నాన్నకు ఇచ్చా' అంటూ ట్వీట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కాగా, ఈ సినిమా సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News