: రాజ్ భవన్ కు కేసీఆర్ దంపతులు...గవర్నర్ సతీమణికి బర్త్ డే విషెస్!
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ దంపతులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ కు భార్య శోభారాణి సహా చేరుకున్న కేసీఆర్, విమల నరసింహన్ కు పుష్పగుచ్ఛం అందించారు. ఆపై గవర్నర్ కుటుంబంతో కాసేపు ముచ్చటించిన కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు వచ్చారు. గవర్నర్ సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే కేసీఆర్ వచ్చారని, మరే విధమైన చర్చలూ వారి మధ్య జరగలేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.