: కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం...మయన్మార్ లో 69 వంతెనల నిర్మాణం
2015 ముగుస్తున్న దశలో కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన కీలక నిర్ణయాలు తీసుకుంది. మయన్మార్ లో అంతర్జాతీయ రహదారి వెంబడి 371.58 కోట్ల రూపాయల వ్యయంతో 69 వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే మాల్దీవులతో పన్నులకు సంబంధించిన సమాచారం పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యపై కెనడాతోను, రైల్వేలలో మౌలిక వసతుల కల్పనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోను కేంద్రం ఒప్పందం చేసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సొరంగ మార్గాలు నిర్మించి పక్కలో బల్లెంలా తయారైన చైనాను మయన్మార్ తో భారత్ చేసుకుంటున్న ఒప్పందాలు ఆందోళనలోకి నెడుతున్నాయి.