: ఏపీ ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అంగీకరించింది. ఇందులో ఉద్యోగులను త్వరగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారీకి ఆమోదించిన కేంద్రం, ఆరు నెలల్లోగా డీపీఆర్ తయారు చేయాలని స్పష్టం చేసింది. చిలకలూరిపేట బైపాస్ హైవే ఏర్పాటుపై డీపీఆర్ తయారుచేసేందుకు కన్సెల్టెన్సీని కేంద్రం నియమించింది. జులై నాటికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది.