: చంద్రబాబు డైనమిక్ లీడర్, కష్టాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది: నీతి ఆయోగ్
ద్రవ్య లోటు నుంచి నిధుల కొరత వరకూ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వృద్ధి పథంలో దూసుకెళ్తోందని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ డైనమిక్ లీడర్ అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని కితాబిచ్చారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఓ గొప్ప కార్యక్రమమని అభిప్రాయపడ్డ ఆయన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.