: తెలంగాణలో సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచిన హైకోర్టు


సెట్ టాప్ బాక్సులు అమర్చుకునేందుకు హైకోర్టు గడువు పొడిగించింది. వాటి ఏర్పాటుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో తెలంగాణ ఎంఎస్ వోల సమాఖ్య అధ్యక్షుడు ఎం.సుభాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సరిపడా సెట్ టాప్ బాక్సులు సరఫరా చేయలేదని, ఈ నేపథ్యంలో గడువు పెంచాలని కోర్టును కోరారు. విచారించిన కోర్టు వారి విజ్ఞప్తిని మన్నించింది. కేబుల్ టీవి డిజిటలైజేషన్ లో భాగంగా సెట్ టాప్ బాక్సుల ఏర్పాటు చేసుకునేందుకు రెండు నెలల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News