: మహబూబ్ నగర్ రెండో స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కూచిపుళ్ల దామోదర్ రెడ్డి రెండో ప్రాధాన్యత స్థానంలో 427 ఓట్లతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.జగదీశ్వర్ రెడ్డికి 273 ఓట్లు లభించాయి. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది.