: నల్గొండ విజయం టీఆర్ఎస్ కు గుణపాఠం అవుతుంది: రాజగోపాల్ రెడ్డి


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరికి కాంగ్రెసే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం టీఆర్ఎస్ కు గుణపాఠం అవుతుందని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విజయాన్ని తమ అధినేత్రి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలనుకున్నామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2019 ఎన్నికల్లో వందశాతం కాంగ్రెస్ దే విజయమని, నల్గొండ అభివృద్ధే లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News