: నల్గొండలో విజయం దిశగా కాంగ్రెస్, మహబూబ్ నగర్ లో ఆధిక్యం


ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకూ 950 ఓట్లను లెక్కించగా, కాంగ్రెస్ కు 520, టీఆర్ఎస్ కు 405 ఓట్లు వచ్చాయి. మరో 10 ఓట్లు చెల్లలేదు. మొత్తం 1000కి పైగా ఓట్లను లెక్కించాల్సి వుండగా, కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమైనట్టే. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, మరో చోట టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాగా, మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సివుండగా, ఆరు స్థానాల్లో పోటీ అభ్యర్థులు లేక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News