: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ... జన్మభూమిపైనే ప్రధాన చర్చ
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో నేటి ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కేబినెట్ మంత్రులంతా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. వచ్చే నెల 2 నుంచి ఏపీలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కానుంది. గతంలో సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. తాజాగా దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ పథకానికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంపై నేటి కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక నూతన ఇసుక పాలసీపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది.