: చంచల్ గూడ జైలు చర్లపల్లికి... రేస్ కోర్సు కూడా నగర శివారుకే!: టీఎస్ సీఎం కేసీఆర్ ఆదేశాలు


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మలక్ పేట పరిధిలోని చంచల్ గూడ జైలుతో పాటు గుర్రపు పందేలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రేస్ కోర్సును కూడా హైదరాబాదు నగర శివారుకు తరలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండింటికి చెందిన స్థలాల్లో కొత్తగా రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా వచ్చే ఏడాది జూన్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కూడా సదరు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News