: ఆర్మీ మాజీ చీఫ్ మల్హోత్రా కన్నుమూత!
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఓపీ మల్హోత్రా (93) మంగళవారం మృతి చెందారు. హర్యానాలోని గుర్గావ్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా, భారత సైన్యానికి మల్హోత్రా 13వ అధిపతిగా పనిచేశారు. 1978-81 వరకు ఆయన ఆర్మీ చీఫ్ గా వ్యవహరించారు. 1990-91 మధ్య కాలంలో పంజాబ్ గవర్నర్ గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా ఆయన పనిచేశారు. 1981-84 వరకు ఇండోనేషియాకు భారత రాయబారిగా ఉన్నారు. మల్హోత్రాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్హోత్రా కుమారుడు అజయ్ మల్హోత్రా రష్యన్ ఫెడరేషన్, కువైట్, రొమేనియాలకు భారత రాయబారిగా పనిచేశారు.