: బహిరంగంగా బిడ్డకు పాలిచ్చిందని కాల్చి పారేశారు!


పసికందుకు పాలిస్తున్న తల్లిని ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాద దళం అల్ ఖన్ సా కాల్చి పారేసింది. ఈ సంఘటన సిరియాలోని అల్ రకాలో జరిగింది. ఒక మహిళ తన పసిబిడ్డతో పాటు అల్ రకా నగరంలోని దుకాణంలో సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. బిడ్డ ఏడవడంతో అక్కడే ఉన్న ఒక చెట్టు పక్కకు వెళ్లి పాలిస్తోంది. ఇదంతా అల్ ఖన్ సా మహిళా ఉగ్రవాద దళ సభ్యులు గమనిస్తున్నారు. వెంటనే అక్కడికి వచ్చి ఆమె వద్ద నుంచి బిడ్డను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఆమెను బహిరంగంగా కాల్చిపారేశారు. ఇస్లామిక్ స్టేట్ నిబంధనల ప్రకారం బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం విరుద్ధమని, అందుకే ఈ దారుణానికి వారు పాల్పడ్డారని సమాచారం.

  • Loading...

More Telugu News