: హిందీ చిత్రసీమలోని చాలా విషయాల్లో ఇమడలేకపోతున్నాను: అదితి రావ్ హైదరి


హిందీ చిత్రసీమలోని చాలా విషయాల్లో ఇమడలేకపోతున్నానని నటి అదితి రావ్ హైదరి తెలిపింది. అందువల్లే తాను పరిశ్రమలో మనిషిని అనే కంటే ఔట్ సైడర్ ని అనే భావం కలుగుతోందని తెలిపింది. తనకు బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లు ఎవరూ లేరని చెప్పింది. తన వెనుక పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్రనటులు, బంధుగణం వంటివి లేవని పేర్కొంది. సోషల్ మీడియాలో తానేదైనా విషయం గురించి చర్చిస్తే దానికి పరిశ్రమ నుంచి పెద్దగా మద్దతు లభించదని పేర్కొంది. డిజిటల్ యుగంలో చాలా మంది దానిని పెద్ద విషయంగా చూస్తారని, తనకు అలాంటివి చిన్న విషయాలుగా తోస్తాయని వెల్లడించింది. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నానని అదితి పేర్కొంది. నెంబర్ గేమ్ ను తాను నమ్మనని, అలాగే ఎవరికో వెన్నుపోటు పొడిచి, వారి అవకాశాలు కాజేయాలనే ఆశ తనకు లేదని స్పష్టం చేసింది. 'ఢిల్లీ 6', 'యే సాలీ జిందగీ హై', 'రాక్ స్టార్' వంటి సినిమాల్లో నటించినా రావాల్సినంత గుర్తింపు రాలేదని అదితి ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News