: పరారైన ఖైదీలను త్వరలోనే పట్టుకుంటాం: జైళ్ల శాఖ డీజీ కృష్ణంరాజు
కడప కేంద్ర కారాగారం నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలను త్వరలోనే పట్టుకుంటామని జైళ్ల శాఖ డీజీ కృష్ణంరాజు పేర్కొన్నారు. కడప జైలును ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖైదీల పరారీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పించుకున్న ఖైదీల కోసం గాలింపు చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. కాగా, కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు సోమవారం నాడు పారిపోయారు. జైలు గోడకు కన్నం వేసి దేవ, రామచంద్ర, హనుమంతు, రవి అనే నలుగురు ఖైదీలు తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.