: ఈ సాయంత్రం రాష్ట్రపతికి గవర్నర్ ప్రత్యేక విందు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఈ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఇస్తున్నారు. ఈ ప్రత్యేక విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సతీమేతంగా హాజరు కావాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. వారితో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలు శాస్త్రవేత్తలు, రచయితలు తదితరులు కలిపి 120 మంది వరకు ప్రముఖులు విందుకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో విడిది చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31తో విడిది ముగుస్తుంది. రాజ్ భవన్ కు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.